MoviesTollywood news in telugu

బాలీవుడ్ బాట పడుతున్న హీరోలు…ఎంతవరకు సక్సెస్…?

Tollywood To Bollywood :మన తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తమదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నుంచి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి తీసుకుంటే, ఎంతోమంది బాలీవుడ్ లో అడుగులు వేసి విజయం అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు రాజనాల, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,సత్యనారాయణ ఇలా చాలామంది బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

అప్పట్లో సువర్ణ సుందరి సినిమాను అదే పేరిట హిందీలో రీమేక్ చేసి, అక్కినేని విజయాన్ని అందుకున్నాడు. నయా ఆద్మీ, చండీరాణి సినిమాలతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కినేని నాగార్జున దాదాపు 10హిందీ మూవీస్ లో నటించాడు. ముఖ్యంగా ఖుదాగవా మూవీలో అమితాబ్ తో కల్సి నటించాడు.

తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన అంకుశం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో డాక్టర్ రాజశేఖర్, జీవిత నటన హైలెట్. ఇదే మూవీని హిందీలో ప్రతిబంద్ పేరిట మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. అలాగే చంటి మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అదే సినిమాను హిందీలో కూడా వెంకటేష్ హీరోగా అనారీ పేరిట రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దమ్ మారో దమ్, బేబీ, వంటి మూవీస్ తో రానా ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ మూవీతో శ్రీరాముడి పాత్ర వేస్తూ,బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

జింజిర్ పేరిట రీమేక్ మూవీలో బాలీవుడ్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగా, ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హిందీ మూవీ అగ్యాత్ లో నితిన్ నటించాడు. ఏజంట్ శ్రీనివాస ఆత్రేయ మూవీలో నటించిన నవీన్ పోలిశెట్టి ఇప్పటికే సుశాంత్ రాజపుట్ హీరోగా చేసిన హిందీ మూవీ చిచ్చోరె లో నటించాడు.

అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేస్తున్నాడు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవుతున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఛత్రపతి మూవీని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్ లో హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."