సింహా సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Simha Movie :బోయపాటి శ్రీను,నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన సింహా మూవీ ఫాన్స్ కే కాదు, సినీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. బిగ్గెస్ట్ హిట్ తో 31కోట్ల షేర్ కొల్లగొట్టిన ఈ మూవీ 2010ఏప్రియల్ 30న రిలీజయింది. డాక్టర్ గా వైద్యం చేయడం,మనిషిగా సమాజంలో కుళ్ళుని ఏరిపారెయ్యడం,కొడుకు పాత్రలో ఇలా ద్విపాత్రాభినయంతో బాలయ్య దుమ్మురేపాడు. నయనతార, స్నేహా ఉల్లాల్,నమిత హీరోయిన్స్ గా చేసారు. చక్రి సంగీతం సూపర్భ్. ఆ ఏడాది సూపర్ హిట్ తో మొదటి స్థానంలో నిల్చింది..
ఇక అదేరోజు ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన బురిడీ మూవీ నిరాశ పరిచింది. సింహా మూవీకి వారం ముందే రిలీజైన ప్రభాస్ డార్లింగ్ మూవీ లో ప్రభాస్,కాజల్ మధ్య ప్రేమ, గ్లామర్ అన్నీ ఆకట్టుకున్నాయి. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ మూవీకి జివి ప్రకాష్ మంచి సంగీతం అందించాడు. సింహా ప్రభావం పడినప్పటికీ లాంగ్ రన్ లో ప్రాఫిట్స్ రావడంతో బయ్యర్స్ కి ఊరటనిచ్చింది.
ఇక శర్వానంద్ నటించిన ప్రస్థానం మూవీ కూడా సింహకు ముందే వచ్చింది. దేవా కట్టా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఏప్రియల్ 13న రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది.
ఇక అదేసమయంలో 1940 ఒక గ్రామం మూవీ వచ్చి, అవార్డు గెలుచుకుంది. ముక్కురాజు ప్రధాన పాత్రలో నటించగా,బాలాదిత్య ,శ్రీ రమ్య హీరో హీరోయిన్స్. రెండు నంది అవార్డులు, సరోజినీదేవి అవార్డుని కూడా అందుకుంది. మంచి టాక్ తో ఏవరేజ్ అయింది.
మే 14న శర్వానంద్ నటించిన అందరి బంధువయా మూవీ వచ్చింది. చంద్ర సిద్ధార్ధ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీగా బిలో ఏవరేజ్ అయింది.
రామ రామ కృష్ణ కృష్ణ మూవీ నాలుగు వారాలు కలెక్షన్స్ బాగున్నా తర్వాత వెనుకబడింది. శ్రీవాస్ డైరెక్షన్ లో రామ్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరుల నటన బాగుంటుంది. మే 15న యంగ్ ఇండియా మూవీ వచ్చింది. అయితే ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది.

