MoviesTollywood news in telugu

సోదరుడే వద్దన్నా సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి…ఎందుకో తెలుసా?

Tollywood actress Sri Lakshmi :ఇంటిల్లిపాదీ కష్టపడితేనే ఇల్లు గడుస్తుందనన్న నానుడిని నటి శ్రీలక్ష్మి వంటబట్టించుకుంది. అందుకే సొంత తమ్ముడు రాజేష్ చెప్పినా సరే, ఆమె కుటుంబ పోషణ కోసం సినిమాల్లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. శ్రీలక్ష్మి తండ్రి అమరనాధ్ సినిమా నటుడే. ఆయన మరణం తర్వాత కుటుంబం మొత్తం హైదరాబాద్ లోఉంది. ఆ తర్వాత కుటుంబం గడవటం కోసం చెన్నై వెళ్ళిపోయింది.

హీరో భానుచందర్ తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కి అమరనాధ్ మంచి ఫ్రెండ్. అయితే ఈ విషయం తెలియక ఆ ఇంటికే అద్దెకు వెళ్లిన శ్రీలక్ష్మి వాళ్ళు ఆ తర్వాత విషయం తెలుసుకున్నారు. నెలవంక మూవీలో రాజేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత జంధ్యాల డైరెక్షన్ లో రెండు జెళ్ళ సీత మూవీలో రాజేష్ ఒక హీరోగా వేసాడు. అయితే ఇదే సినిమాలో సుత్తివేలు భార్యగా శ్రీలక్ష్మికి చిన్న వేషం ఇచ్చారు.

ఇది తెల్సిన రాజేష్ తన అక్కను సినిమాల్లో వేయొద్దని,ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నానా గొడవ చేసాడు. అయినా సరే, కుటుంబం గడవాలంటే అందరం కష్టపడాలని చెప్పి నటించింది. రాజేష్ కొన్ని సినిమాల్లో హీరోగా రాణిస్తున్న సమయంలో ప్రమాదంలో మరణించడంతో శ్రీలక్ష్మి పలు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా కొనసాగుతూ వస్తోంది. నటిగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా ఈ మధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."