MoviesTollywood news in telugu

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ కిడ్స్…ఎవరో చూడండి

Star Kids Tollywood Entry :సినిమా ప్రపంచంలో ఇప్పుడంతా వారసుల మయం. హీరోల కొడుకులే హీరోలుగా వస్తున్నారు. ఇందులో కొందరు నిలబడతుంటే, మరికొందరు ఫేడ్ అవుట్ అవుతున్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేమీ కొత్తకాదు. గతంలో ఎన్టీఆర్,కృష్ణ, తదితర స్టార్ హీరోల కొడుకులు,కూతుళ్లు చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు.

బయట పిల్లల కంటే స్టార్ హీరోల పిల్లలను సెలెక్ట్ చేస్తే క్యాష్ చేసుకోవచ్చని నిర్మాతలు యోచన చేయడం వలన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై తళుక్కున మెరవబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ, సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనయుడు మాస్టర్ అభిరాం ఆర్ ఆర్ ఆర్ మూవీలో చిన్నప్పటి తారక్ గెటప్ లో కనిపించబోతున్నాడట.

ఇక నెన్నొక్కడినే మూవీలో మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ నటించగా, సర్కారువారి పాట మూవీతో సితార ఎంట్రీ ఇస్తోందట. ఇక అల్లు అర్హ అయితే గుణశేఖర్ డైరక్షన్ లో రాబోయే చారిత్రక మూవీ శాకుంతలం మూవీలో భరతుడి పాత్రలో మెరుస్తుందట. వీళ్ళే కాదు, కెజిఎఫ్ హీరో యష్ కూతురు, తమిళ హీరో ధనుష్ పిల్లలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇస్తున్నారట. మహానటి ఫేమ్ దుల్హన్ సల్మాన్ కూతురు కూడా సినిమాల్లోకి వస్తోందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."