MoviesTollywood news in telugu

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుండి తప్పుకున్న అభి…కారణం ఇదే

Intinti Gruhalakshmi Serial Abhi :ప్రముఖ టివి ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి పాపులార్టీ సంపాదించుకుంది. టి ఆర్పీ రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్ కి పోటీగా ఇంటింటి గృహలక్ష్మి నిలుస్తోంది. ఇందులో నటీనటులు తమ అందంతో అభినయంతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు.

ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ కి కోడలి క్యారెక్టర్ లో నటిస్తున్న శిరీష్ ఈ సీరియల్ నుంచి తప్పుకోగా, అభి క్యారెక్టర్ చేస్తున్న మరో నటుడు శ్రీహర్ష కూడా వైదొలిగాడు. సీరియల్ మంచి రంజుగా నడుస్తున్న సమయంలో ఇలా జరగడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒంట్లో బాగోలేదని, కరోనా థర్డ్ వేవ్ వలన తప్పుకున్నాడని, మరో సీరియల్ లో ఛాన్స్ వచ్చి ఉంటుందని అభి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంటింటి గృహలక్ష్మి నుంచి అభి వెళ్లిపోవడానికి అసలు కారణం మూవీస్ లో ఆఫర్స్ రావడమేనని వినిపిస్తోంది. టైం మేనేజ్ మెంట్ కుదరక సీరియల్ నుంచి వెళ్లిపోయాడని అంటున్నారు. ఇతడి ప్లేస్ లో వెంకట్ శిరీష్ నటిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."