MoviesTollywood news in telugu

సంక్రాంతికి నాగార్జున బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్…ఎన్ని ఉన్నాయో…?

Nagarjuna Blockbuster Movies at Sankranthi Season : సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదలై సందడి చేయడం మామూలే. అయితే టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తూ వచ్చాయి. 1987జనవరి 14న దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన మజ్ను మూవీ మంచి హిట్ అందుకుంది. అప్పటికే రెండు మూడు సినిమాలు దెబ్బతినడంతో సక్సెస్ కోసం చూస్తున్న నాగార్జునకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. రజనీ హీరోయిన్. కామెడీ, కంటతడి పెట్టించే సన్నివేశాల మేళవింపు సినిమా కావడంతో బాగానే ఫాన్స్ కి రీచ్ అయింది.

ఇక 1992లో ఫాజిల్ డైరెక్షన్ లో వచ్చిన కిల్లర్ మూవీ సంక్రాంతి బరిలో నిల్చి బ్లాక్ బస్టర్ అయింది. నాగ్ సరసన నగ్మా హీరోయిన్ గా చేసింది. శారద ఒక కీలక పాత్రలో నటిచింది. ఇళయరాజా అందించిన సాంగ్స్ అలరించినా ఈ సినిమా ఏవరేజ్ అయింది. 1998జనవరి 14న వచ్చిన ఆవిడా మా ఆవిడే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగ్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ నడుమ నాగ్ నటన అలరించింది. టబు హీరోయిన్ గా బ్రహ్మానందం కామెడీతో ఆకట్టుకున్నారు.

ఇక నూతన దర్శకుడు కల్యాణ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన మూవీ 2016జనవరి 15న వచ్చింది. సరసాల శృంగార పురుషుడిగా తండ్రి పాత్ర, అమాయక చక్రవర్తి పాత్రలోనూ నాగ్ డబుల్ రోల్ నటన ఆడియన్స్ ఆకట్టుకుంది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంది. పెద్ద నాగార్జున సరసన నలుగురైదుగురు హీరోయిన్స్ తళుక్కున మెరవడం బాగా ఆకట్టుకుంది. బంగార్రాజు పాత్రలో నాగ్ పరకాయ ప్రవేశం చేసాడనేలా సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."