Beauty TipsHealth

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలంటే మందారంతో ఇలా చేయండి!

Mustard Seeds Hair Fall Tips In Telugu :ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. నల్లని,ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య ను మనలో చాలా మంది ఎదుర్కొంటున్నారు.

జుట్టు రాలే సమస్య కోసం మార్కెట్లో దొరికే ఏ ప్రొడక్ట్ అవసరం లేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకున్న నూనె సరిపోతుంది. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు.

దీని కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి పావు లీటర్ కొబ్బరి నూనె వేసి దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, పది లవంగాలు, ఒక ఇంచు అల్లం ముక్క, 4ఎర్ర మందార పువ్వులు,12 మందార ఆకులు, గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించాలి.

ఈ నూనె బాగా మరిగాక వడగట్టుకుని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయుండి. ఈ నూనె జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా చేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."