MoviesTollywood news in telugu

నటుడు మురళీ శర్మ రియల్ లైఫ్…భార్య ఎవరో తెలుసా?

Tollywood Actor Murali Sharma : సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అతిధి మూవీతో కైజర్ గా విలన్ రోల్ తో ఎంట్రీ ఇచ్చిన నటుడు మురళీ శర్మ టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ అయ్యాడు. గుంటూరు లో పుట్టిన ఇతడి వయస్సు ప్రస్తుతం 49ఏళ్ళు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వకముందు బాలీవుడ్ లో పలు మూవీస్ లో చేసాడు. మురళీ శర్మ తండ్రి మరాఠీ కావడం, తల్లి గుంటూరుకి చెందిన వ్యక్తి కావడం, పైగా మురళీశర్మ ముంబైలో పెరగడం విశేషం.

అంతకుముందే పెళ్ళై 2002లో విడాకులిచ్చినా మరాఠా నటి అశ్విని కళైకర్ని ని 2009లో మురళీశర్మ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా తెలుగులో అల్లు అర్జున్ నటించిన బద్రీనాధ్ మూవీలో తళుక్కున మెరిసింది. రవితేజ నటించిన సినిమాతో పాటు మెహబూబా మూవీలో నటించిన ఆమె మళ్ళీ తెలుగులో కన్పించలేదు. సీరియల్స్ లో కూడా ఈమె పాపులర్ అయింది. ఇక మురళీశర్మ కూడా టివి షోస్ తో పాపులర్ అయ్యాడు.

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ మూవీలో కూడా వెరైటీ విలన్ కేరక్టర్ తో మురళీ శర్మ దుమ్మురేపాడు. విలన్ అనే కాదు, ఎలాంటి క్యారెక్టర్ రోల్ ఇచ్చినా అవలీలగా పోషిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాల్లో సైతం నటిస్తూ నటుడిగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."