MoviesTollywood news in telugu

మెగాస్టార్ డబుల్ రోల్ మూవీస్ ఎన్ని ఉన్నాయో చూడండి

Chiranjeevi Dual Role Movies :స్వయంకృషితో కిందిస్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎన్నో సినిమాల్లో డబుల్ రోల్ చేసారు. అంతెందుకు రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150లో కూడా చిరంజీవి డ్యూయల్ రోల్ చేసారు. 14 సినిమాల్లో డ్యూయల్ రోల్ పోషించారు. అయితే తొలినాళ్ళలో 1980లో రిలీజైన నకిలీ మనిషి మూవీతోనే చిరు డబుల్ క్యారెక్టర్ చేసారు. ఎస్ డి లాల్ డైరెక్ట్ చేసారు. హీరో,విలన్ గా కూడా ఆయనే నటించారు. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో 1982లో వచ్చిన భిల్లా రంగా మూవీలో చిరు డబుల్ రోల్ చేసారు. మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో చిరు తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు.

చిరంజీవి పోలీసాఫీసర్ గా, దొంగగా రెండు పాత్రల్లో నటించిన చిరు మూవీ రోషగాడు 1983లో రిలీజయింది. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్ట్ చేసారు. సింహపురి స్వప్నం మూవీలో తండ్రీ కొడుకులుగా చిరు నటించారు. కోడి రామకృష్ణ చేసిన ఈ మూవీ 1983లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో 1985లో రిలీజైన జ్వాలా మూవీలో చిరు అన్నదమ్ములుగా రెండు పాత్రల్లో నటించారు. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో 1985లో వచ్చిన రక్త సింధూరం మూవీలో చిరు నక్సలైట్ గా, పోలీసాఫీసర్ గా ద్విపాత్రాభినయం చేసారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లోనే 1987లో వచ్చిన దొంగ మొగుడు మూవీలో చిరు డబుల్ యాక్షన్ చేసారు.

యముడికి మొగుడు మూవీలో అమాయకపు పాత్రలో, అలాగే మనసున్న దొంగగా రెండు పాత్రలు పోషించాడు. 1988లో వచ్చిన ఈ మూవీకి రవిరాజా పినిశెట్టి డైరెక్టర్. 1991లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన రౌడీ అల్లుడు మూవీలో చిరు డ్యూయల్ రోల్ వేశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే 1994లో వచ్చిన ముగ్గురుమొనగాళ్ళు మూవీలో అయితే మూడు పాత్రల్లో చిరు మెప్పించారు.1995లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో రిక్షావోడు మూవీలో తండ్రీ కొడుకులుగా చిరు నటించారు. కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 1999లో వచ్చిన స్నేహంకోసం మూవీలో చిరు డబుల్ రోల్ చేసాడు. అలాగే శ్రీను వైట్ల డైరెక్షన్ లో 2005లో రిలీజైన అందరివాడు మూవీలో చిరు రెండు పాత్రల్లో మెప్పించారు.