MoviesTollywood news in telugu

జానీ సినిమా కోసం పవన్ ఎన్ని ప్రయోగాలు చేశాడో…?

Pawan kalyan johnny Movie :మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. హిట్స్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలకు కలెక్షన్స్ వర్షం రప్పిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ సొంతంగా డైరెక్ట్ చేస్తూ, స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడంతో పాటు తానే నటించిన జానీ మూవీ తీవ్ర నిరాశ మిగిల్చింది.

భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ మొదట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీ కోసం పవన్ ఎన్నో ప్రయోగాలు చేసాడు. లైవ్ రికార్డింగ్ చేసిన ఈ సినిమాలో ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పనవసరం లేకుండా 90శాతం షూటింగ్ స్పాట్ లోవే ఫైనల్ చేసారు. గుండు కొట్టించు కున్నాడు. హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. చివరకు జపాన్ కూడా వెళ్లి ఐక్విడో నేర్చుకున్నాడు. లాస్ ఏంజిల్స్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడు.

ఇక ఈ మూవీ పవన్ చనిపోవడంతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఫాన్స్ ని నిరాశ పర్చడం ఇష్టం లేక కథను కొంచెం మార్చాడు. అయినా సినిమా ఆడకపోవడంతో తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసాడు. అన్నట్టు ఈ సినిమాలో రెండు పాటలను పవన్ కళ్యాణ్ పాడాడు. మొత్తం మీద ఈ సినిమా కోసం పవన్ చాలా శ్రమించడంతో డిజాస్టర్ అయినప్పటికీ ఓ మైలురాయిగా ఈ సినిమా చెప్పుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."