MoviesTollywood news in telugu

టాలీవుడ్ మన్మదుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా…?

Tollywood senior top hero akkineni nagarjuna :టాలీవుడ్ మన్మదుడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నాగార్జున గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున టాలీవుడ్ కి విక్రమ్ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. నాగార్జున కేవలం నటుడిగానే కాకుండా స్టూడియో అధినేత గా,డిస్ట్రిబ్యూటర్ గా,నిర్మాతగా,టీవీ వ్యాఖ్యాతగా ఒక బిజినెస్ మాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయడమే కాకుండా ఎంతోమంది దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూ మరోవైపు మాస్ చిత్రాలు చేస్తూ… ఇంకా భక్తిరస చిత్రాలను కూడా చేసి అభిమానులను మెప్పించాడు అలాగే క్లాస్ హీరోగా కూడా మెప్పించాడు.
నాగార్జున తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించి సత్తా చాటారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు.

1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించిన నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కూతురు వెంకటేష్ చెల్లి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు నాగ చైతన్య.

కొంత కాలానికి వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత నాగార్జున శివ చిత్రంలో నటించిన సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. వీరి కుమారుడు అఖిల్. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ తమకంటూ సొంత ఇమేజ్ కోసం కృషి చేస్తున్నారు.