MoviesTollywood news in telugu

వైవిధ్యమైన గెటప్ లో బన్నీ…మేకప్ కోసం ఎన్ని గంటలో…?

Allu arjun spends more 3 hours makeup pushpa movie :విభిన్న తరహా పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలు చేయడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి బెడిసి కొడతాయి. అయినప్పటికీ క‌మ‌ల్ హాస‌న్,విక్ర‌మ్ చియాన్‌లు ఈ విషయంలో ముందువరుసలో ఉంటారని చెప్పాలి. ఎందుకంటే వారి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంత క‌ష్టమైన ఇష్టంగా భావించి, ఆయా పాత్రలలో జీవిస్తారు. అందుకే ఎప్పుడూ వారు వైవిధ్యమైన కథలతో డిఫరెంట్‌లుక్‌తో ఆశ్చర్యపరుస్తుంటారు.

విచిత్ర సోదరులు,దశావతారం వంటి సినిమాలు కమల్ వైవిధ్య నటనకు అద్దం పడితే, అపరిచితుడు,ఐ లాంటి మూవీస్ విక్రమ్ నటనకు నిదర్శనంగా నిలుస్తాయి. అయితే తెలుగులో కూడా అలాంటి నటులున్నారని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నిరూపిస్తున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ వైవిధ్యంగా కనిపించబోతున్నాడు.

పాన్‌ ఇండియా మూవీగా తీస్తున్న ‘పుష్ప’ మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా నడుస్తుందని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. కరోనా కారణంగా ఆలస్యమైనా ఈ మూవీ ఇప్పుడు ముగింపు దశకు చేరింది.ఈ మూవీలో మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌తో బన్నీ కనిపిస్తాడని, నూటికి నూరుశాతం తన పాత్రకు న్యాయం చేసాడని ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ వెల్లడిస్తోంది.

దీంతో బన్నీ ఫాన్స్ లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రింగులజుట్టు,గడ్డంతో ఊరమాస్‌గా భయంకరమైన స్మగ్లర్‌ పుష్పరాజుగా బన్నీ కన్పిస్తాడు. ఎక్కడా తేడా రాకుండా తన లుక్‌ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడట. ఇన్నాళ్లూ లవర్‌ బాయ్‌లా కనిపించే బన్ని ఈ మూవీలో పుష్ప రాజులా కనిపించడానికి తనని తాను మలచు కుంటున్న తీరు హేట్సాఫ్ అనేలా ఉందట.

ముఖ్యంగా సెట్‌లో మేకప్‌కు వేసుకోవడానికి, తీయడానికి రోజుకి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. మరి బన్నీ పడుతున్న కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో ఆడియన్స్ తేల్చాలి. అందుకే సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."