MoviesTollywood news in telugu

బిగ్ బాస్ ఆలస్యానికి అసలు కారణం ఇదేనట…స్పెషల్స్ ఎక్కువే…?

Bigg Boss 5 telugu :ఎన్నో విమర్శలు,ఆరోపణల నేపథ్యంలో తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకుని ఇప్పుడు 5వ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. సెప్టెంబర్ 5న ప్రారంభ కార్యక్రమం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో వినోదాన్ని అందించడానికి సిద్ధం గానే ఉంది. అయితే ఇప్పటివరకూ 16మంది కంటెస్టెంట్స్ తో నడిచిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు 20మందితో నడుస్తుందని టాక్. అయితే ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది ఉండదట.

నిజానికి బిగ్‌బాస్‌ షో మొదలయ్యే వరకు అందులో పాల్గొనేవారు ఎవరు అనే విషయాన్ని షో నిర్వాహకులు రహస్యంగానే ఉంచుతారు. అయినా సరే ప్రతిసారి సోషల్ మీడియాలో పేర్లు లీకు అవుతూనే ఉంటాయి. రసవత్తరంగా నడిపించడం కోసం, అలాగే షోను అద్యంతం ఆసక్తికరం చేయడానికి నిర్వాహకులు రకరకాల సెలబ్రిటీస్‌ను చివరివరకూ సంప్రదిస్తూనే ఉంటారు. దాంతో లేటవుతూ ఉంటుంది. పైగా ఫైనల్‌ లిస్ట్‌ వచ్చేసరికి పేర్లు మారిపోతూనే ఉంటాయి.

బిగ్‌బాస్‌ 5 కోసం ఎవవరెవరిని నిర్వాహకులు సంప్రదించారో, ఎవరెవరు పాల్గొంటారో అనే కోణంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, సినిమాల్లో ఆదరణ పొందిన సీనియర్‌ నటి సురేఖవాణి పేరు గట్టిగానే విన్పిస్తోంది. అలాగే టీవీ,సినీ నటి ప్రియ, యాంకర్ రవి వంటి పేర్లతో పాటు యూట్యూబ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. షోలో పాల్గొనాలంటే దాదాపు 10 0రోజులు ఇంటిని వదిలిపెట్టి బిగ్ బాస్ హోస్ లో ఉండాల్సి ఉంటుంది. దాంతో కొంతమంది ఉత్సాహం ఉన్నా బయట ఛాన్స్ లు వదులుకోలేక ఆసక్తి చూపడం లేదట. దానివల్లనే బిగ్ బాస్ సీజన్ 5ఆలస్యానికి కారణమని విశ్లేషకుల అంచనా.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."