Devotional

సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు ఈ సమయంలో పూజ చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

vinayaka chavithi : మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు,పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి,మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకూండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టిన రోజు అని కొందరు ఆలా కాదు గణాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు. 

ఈ సంవత్సరం 2021లో సెప్టెంబర్ పదో తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శుభ తిథి ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై రాత్రి 9:57 గంటల వరకు ఉంటుంది. గణేష్ చతుర్థి పూజా శుభ ముహుర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:33 గంటల వరకు ఉంటుంది.

వినాయక చవితి రోజున చందమామను చూడకూడదనే ఒక ఆచారం ఉంది. పురాణాల ప్రకారం ఈరోజు చంద్రుడిని దర్శించుకోవడం నిషేధించారు. ఒకవేళ పొరపాటున మీరు చందమామను చూస్తే మీకు శాపం తగిలే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే.. తర్వాతి రోజు తెల్లని వస్త్రాలు, తెల్లని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచిదని నమ్ముతారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."