రాజమకుటం సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

Raja Makutam Movie Facts In Telugu : కడప జిల్లా పులివెందుల సమీపంలోని యెద్దలయ్య గారి కొత్తపల్లిలో జన్మించిన బిఎన్ రెడ్డి కొంతకాలం చదువు పూర్తయ్యాక మద్రాసు వెళ్లారు. రాజమకుటం లాంటి మూవీ తీసిన ఘనత ఆయనదే. ఈయన పూర్తిపేరు బి నాగిరెడ్డి. ఈయన సోదరుడు పుల్లారెడ్డి.

రాజమకుటం మూవీలో బిఎన్ రెడ్డి ప్రతిభ కన్పిస్తుంది. కెవి రెడ్డి మాదిరి జానపద చిత్రాలు తీయలేనని చెబుతూనే రాజమకుటం తీశారు. 1960లో రిలీజైన ఈ సినిమాలో నటరత్న ఎన్టీఆర్ హీరోగా చేసారు. ఈ మూవీని తమిళంలో కూడా రిలీజ్ చేసారు. అయితే తెలుగు,తమిళంలో కూడా ఆడలేదు.

కళాతపస్వి కె విశ్వనాధ్ ఈ మూవీకి రీ రికార్డింగ్ చేసారు. విజయవాడలో జనం మధ్య కూర్చుని ఈ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ లో కొందరు బిఎన్ రెడ్డి ఇలాంటి మూవీ తీశారేంటి అని అనగానే లేచి బయటకు వచ్చేసారట. మాస్టర్ వేణు సంగీతం అందించారు. సడిచేయకో సాంగ్ ఇందులోదే. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసారు. కొసరాజు జానపద గీతాలు రాసారు. బాలాంత్రపు రజనీకాంతరావు కూడా పాటలు రాసారు.