MoviesTollywood news in telugu

అమితాబ్ సినిమాల రీమేక్ లో నటరత్న ఎన్టీఆర్…ఎన్ని హిట్…?

Ntr remakes from amitab bachchan :పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా నిల్చిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అడివి రాముడు మూవీ నుంచి ట్రెండ్ మార్చారు. బొబ్బిలిపులి,కొండవీటి సింహం,జస్టిస్ చౌదరి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే ముందు నటించిన సినిమా నాదేశం. ఎన్టీఆర్ మొదటి సినిమా మనదేశం నటుడిగా తెరముండు నిలబెడితే, నాదేశం మూవీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జనంలోకి దూసుకెళ్లడానికి పొలిటికల్ డైలాగ్స్ తో రూపుదిద్దుకుంది.

అయితే నాదేశం మూవీ హిందీలో అమితాబ్ నటించిన లావారిస్ మూవీకి రీమేక్. మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు,మల్టీస్టారర్ మూవీస్ కూడా అలాగే వచ్చాయి. ఎన్టీఆర్,అక్కినేని కల్సి నటించిన సత్యం శివం మూవీ కూడా అమితాబ్,శశికపూర్ నటించిన సుహాగ్ మూవీకి రీమేక్. అలాగే వినోద ఖన్నా,అమితాబ్ కల్సి నటించిన హెరాఫెరీ మూవీకి రీమేక్ గా రామకృష్ణులు మూవీ ఎన్టీఆర్, అక్కినేని కాంబినేషన్ లో వచ్చింది.

అమితాబ్, వినోద్ ఖన్నా కల్సి నటించిన ఖూన్ పసీనా మూవీకి రీమేక్ గా తెలుగులో ఎన్టీఆర్,రజనీకాంత్ కల్సి నటించిన టైగర్ మూవీ వచ్చింది. ఇక అమితాబ్ నటించిన డాన్ మూవీని ఎన్టీఆర్ యుగంధర్ పేరుతొ తెలుగులో చేసారు. అలాగే అమితాబ్ నటించిన దో అంజానే మూవీని తెలుగులో మావారి మంచితనం, అలాగే అమితాబ్ దీవార్ మూవీని తెలుగులో మగాడు పేరుతొ ఎన్టీఆర్ హీరోగా రీమేక్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ 52ఏళ్ళ వయస్సులో అమితాబ్ జంజీర్ మూవీకి రీమేక్ గా నిప్పులాంటి మనిషి మూవీలో ఎన్టీఆర్ హీరోగా రీమేక్ చేసి,సూపర్ హిట్ అందుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."