భారతీయుడు సినిమా మేకప్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా ?
Bharateeyudu Movie :విభిన్న తరహా చిత్రాలు చేయడంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ దిట్ట. అలాగే దర్శకుడు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. వీరిద్దరి కాంబినేషన్ లో అవినీతికి వ్యతికరేకంగా పోరాటం చేసే అంశంతో భారతీయుడు సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే ఇప్పటి అవినీతి మీద ఎలా ఉండేవాడో అనే స్టోరీ లైన్ ఎంచుకుని తెరకెక్కించిన మూవీ ఇది. అన్ని భాషల్లో రిలీజై,60కోట్లు కలెక్ట్ చేసి,డబ్బింగ్ మూవీస్ లో రికార్డుగా నిల్చింది.
ఇందులో డబుల్ రోల్ వేసి కమల్ ఆకట్టుకున్నాడు. ఏ ఎం రత్నం దాదాపు 12కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించాడు. అన్యాయాన్ని ఎదిరించే స్వాతంత్ర్య సమరయోధుని పాత్రలో,అవినీతికి మారుపేరుగల ఉద్యోగిగా ఇలా రెండు గెటప్స్ లో కమల్ అద్భుత నటన ప్రదర్శించాడు. ఐశ్వర్యారాయ్, శిల్పాశెట్టి కోసం ట్రై చేస్తే, డేట్స్ కుదరక మనీషా కొయిరాలాకు సెలెక్ట్ చేసారు. 1995లో మొదలు పెట్టిన షూటింగ్ 150రోజులు సాగి, చివరకు 1996ఏప్రియల్ లో రిలీజ్ చేసారు. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో రిలీజ్ చేయగా, అన్నిచోట్లా బ్లాక్ బస్టర్ అయింది. మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.
ఇంతకీ స్వాతంత్ర్య సమరయోధుడు భార్య గెటప్ లో రాధికను అనుకుంటే, ఆమె కుదరదని చెప్పడంతో చివరకు సుకన్యను తీసుకున్నారు. కమల్ గెటప్ వేయడానికి రోజుకి 5గంటలు, తీయడానికి 2గంటలు పట్టేది. ప్రత్యేకించి కోటి రూపాయలు వెచ్చించి అమెరికా నుంచి మేకప్ మ్యాన్స్ ని రప్పించారట. ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసారు. ఇక కొడుకు పాత్ర కోసం అజిత్ ని తీసుకోవాలని భావించారట. కానీ రెండు పాత్రలను కమల్ చేయడానికి ఒకే చెప్పడంతో పెద్ద ఇబ్బంది తప్పిందట. ప్రసాద్,వాహిని స్టూడియోలతో పాటు ముంబయిలో కొంత భాగం తీశారు. టెలిఫోన్ ధ్వనిలా సాంగ్ ఆస్ట్రేలియాలో షూట్ చేసారు

