Beauty TipsHealth

Hair Care Tips:కేవలం 5 రూపాయిల ఖర్చుతో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Hair Fall : కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రాలుతూనే ఉంటుంది. దీని వల్ల చాలా బాధలు పడతారు. అంతేకాకుండా చూడ్డానికి జుట్టు పీలగా, సన్నగా మారిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు జుట్టు ఎందుకు రాలుతుంది..

జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. దీని కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకుని జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగే లాగా చేసుకోవచ్చు.
Betel Leaf Benefits in Telugu
దీనికోసం ఒక గిన్నెలో 150 గ్రాముల కొబ్బరి నూనె పోసి దానిలో మూడు తమలపాకులు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి కట్ చేసి వేయాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులను వేయాలి. దీనిని పొయ్యిమీద పెట్టి బాగా మరిగించాలి. అంటే మనం తీసుకున్న పదార్థాలు బాగా వేగే దాకా మరిగించాలి.
fenugreek seeds
ఆ తర్వాత ఈ నూనెను వడగట్టి సీసాలో పోసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను ప్రతిరోజు తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తలలో వెంట్రుకలకు రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఈ నూనెను మనం రెగ్యులర్ గా ఉపయోగించే నూనెకు బదులు వాడితే సరిపోతుంది. ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."