Movies

సమంత సినిమాల్లో ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా ?

Tollywood Heroine Samatha :అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత పెళ్ళిచేసుకుని ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంటగా పేరుతెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య వీరిద్దరి మధ్య క్లాషెస్ వచ్చి, విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే పెళ్లికాక ముందు కన్నా పెళ్లయ్యాక సమంత సంపాదన మరింత పెరిగింది.

పెళ్ళికి ముందు ఏం మాయ చేసావే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ, మరోపక్క వెబ్ సిరీస్, యాడ్స్ చేస్తూ అన్నివైపులా సంపాదిస్తోంది. అంతేకాదు, ప్రాధ్యాన్యత గల పాత్రలు సెలెక్ట్ చేసుకుంటోంది. ఈదశలో రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్.

సమంత ఒక్కో సినిమాకు రెండు మూడు కోట్లకు తక్కువ తీసుకోవడం లేదట. దీంతో మొత్తంగా ఆమె ఆస్తులు 100కోట్ల పైమాటేనని అంటున్నారు. భాగ్యనగరంలో కార్లు, బంగ్లాలు కొనడమే కాకుండా, వ్యాపారాలు కూడా లాభసాటిగా చేస్తోందట. ఇక వెబ్ సిరీస్ కి సంబంధించి ది ఫామిలీ మ్యాన్ 2కోసం ఏకంగా 4కోట్లు అందుకుందట.