Movies

ఇస్మార్ట్ శంకర్ కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. రామ్ పోతినేని కి మంచి బ్రేక్ ఇచ్చిన ఈ మూవీలో హీరోయిన్ నభా నటేష్ అందాలు ఆరోబోసింది. 20కోట్లతో తీసిన ఈ మూవీ 2019జులై 18న రిలీజై రెట్టింపు షేర్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీకి రెండు వారాలముందు బుర్రకథ మూవీ వచ్చింది. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సాయికుమార్ అది హీరోగా చేసాడు. సినిమా కొత్తదనం ఉన్నా, ప్లాప్ అయింది.

ఇదే రోజున విజయ కృష్ణ హీరోగా చేసిన దుర్మార్గుడు మూవీ వచ్చింది. లవ్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ నిరాశపరిచింది. ఇదే రోజున తారకరత్న హీరోగా కాకతీయుడు మూవీ రిలీజయి, ప్లాప్ గానే మిగిలింది. ఇక జులై 5న సమంత కీలక పాత్రలో ఓ బేబీ మూవీ రిలీజై, విశేష ఆదరణ పొందింది. సమంత యాక్టింగ్ అదిరిపోయింది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. రెండు రెట్ల లాభం ఆర్జించి ఇస్మార్ట్ శంకర్ కి గట్టి పోటీ ఇచ్చింది.

ఆర్. నారా యణమూర్తి హీరోగా జులై 12న రిలీజైన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ మూవీ ప్లాప్ గానే మిగిలింది. ఇదే రోజున రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘమ్స్ శ్రీహరి హీరోగా నటించిన రాజ్ దూత్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. సమీర్ ఖాన్, శైలజాతివారి జంటగా నటించిన హర్రర్ రొమాంటిక్ మూవీ కె ఎస్ 100 కూడా అదేరోజు వచ్చింది. అయితే ఇది కూడా నిరాశపరిచింది.

సందీప్ కిషన్ హీరోగా నటించిన నిను వీడను నీడను నేనే మూవీ హారర్ నేపథ్యంలో కార్తీక్ రాజ్ తెరకెక్కించాడు. ఏవరేజ్ గా నిల్చింది. దొరసాని మూవీ కూడా ఇదేరోజు వచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్, డాక్టర్ రాజేశేఖర్ కూతురు శివాని నటించిన దొరసాని మూవీ కూడా నిరాశపరిచింది. జులై 19న విక్రమ్, అక్షర హాసన్ జంటగా నటించిన మిస్టర్ కేకే మూవీ ని రాజేష్ ఎస్ సెల్వ డైరెక్ట్ చేసాడు. తెలుగులో ఇది పెద్దగా ఆకట్టుకోలేదు.

అమలాపాల్ కీలక భూమిక పోషించిన ఆమె మూవీ కూడా అదేరోజున వచ్చింది. పోస్టర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ తెరమీద అలరించలేక పోయింది. జులై 26న విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ వచ్చింది. రష్మిక, విజయ్ ల కెమిస్ట్రీ అలరించిన సినిమా ఆడలేదు. ఇదే రోజున హర్షిత్, శ్రీపద్మ జంటగా నటించిన నేను లేను మూవీ కూడా పెద్దగా అలరించలేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆగస్టు 2న రిలీజైన రాక్షసుడు మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సెమీ హిట్ గా నిల్చింది. ఇదే రోజున కార్తికేయ హీరోగా నటించిన గుణ 369మూవీ ఫెయిల్ అయింది. అదేరోజు శివరంజని మూవీ వచ్చింది. రష్మీ గౌతమ్, నందు జంటగా నటించిన ఈ మూవీ ప్లాప్ అయింది. ఇస్మార్ట్ శంకర్ కి 3వారాల ముందుగా వచ్చిన కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2మూవీ కూడా విజయాన్ని అందుకోలేకపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."