Movies

నరసింహనాయుడుకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Balakrishna Narasimha Naidu movie :సోదరుల క్షేమాన్ని అనుక్షణం కాంక్షిస్తూ, వారికోసం ఎలాంటి తెగింపు నైనా ప్రదర్శించే పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీ. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2001జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చి, దుమ్మురేపింది. ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ సూపర్భ్. సిమ్రాన్, ప్రీతి జింగనియా హీరోయిన్స్ గా నటించారు. కళాతపస్వి కె విశ్వనాధ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు.

జనవరి 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు మూవీ కూడా రిలీజయింది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, నరసింహనాయుడుతో పోల్చడం వలన ప్లాప్ గా మిగిలింది. జనవరి 15న విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు రిలీజయింది. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కోడి రామకృష్ణ డైరెక్టర్. అంజలా జవేరి కూడా నటించిన ఈ మూవీ ఎవరెజ్ అయింది.

జనవరి 18న విక్రమ్ నటించిన శివుడు మూవీ రిలీజయింది. అయితే తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీకి రెండు వారాల ముందుగా ఆర్ నారాయణ మూర్తి నటించిన చలో అసెంబ్లీ మూవీ డిసెంబర్ లో వచ్చింది. కొంత ఏవరేజ్ గా నడిచినా నరసింహనాయుడు దెబ్బకి కనుమరుగైంది. అదేరోజు జీజే రాజా డైరెక్షన్ లో వచ్చిన రోజుకో రోజా మూవీ లో రాజా విక్రమ్, స్వప్నశ్రీ తదితరులు నటించారు. ఈ రొమాంటిక్ మూవీ నిరాశపరిచింది.