బ్యూటీ సీక్రెట్స్ చెప్పేసిన రోడీ బేబీ…ఏమిటో తెలుసా ?

Tollywood Heroine Sai Pallavi :తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులార్టీ తెచ్చుకున్న సాయిపల్లవి ప్రాధాన్యత ఉన్న పాత్రలను, ఓల్గారిటీ లేని పాత్రలను సెలక్ట్ చేసుకుని దూసుకుపోతోంది. ఈమె నటించిన విరాట పర్వం, శ్యామ్ సింగరాయ మూవీస్ షూటింగ్స్ పూర్తవ్వడంతో రిలీజ్ తరువాయి.

తెలుగులోనే కాకుండా కోలీవుడ్ , మలయాళ భాషల్లో కూడా చేతిలో సినిమాలు పెట్టుకున్న సాయిపల్లవి అందంగా ఉండడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. తగిన పాళ్ళలో ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే అందంగా ఉంటామని చెబుతోంది.

షూటింగ్ సమయంలో జుట్టుకు కలర్ వేయించుకోనని, తన జుట్టు సహజ సిద్ధంగా ఉంచుకోవడం వలన అందంగా కనిపిస్తున్నానని సాయిపల్లవి తన అందం సీక్రెట్స్ వివరిస్తూ చెప్పుకొచ్చింది.కృతిమ సబ్బులు, షాంపుల కంటే నేచురల్ గా ఉన్నవే వాడుతుందట. అందుకే నేచురల్ బ్యూటీ అయింది.