MoviesTollywood news in telugu

అహ నా పెళ్ళంట సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Aha Naa Pellanta Movie : జంధ్యాల మార్క్ కామెడీతో రాజేంద్ర ప్రసాద్, రజనీ జంటగా నటించిన అహ నా పెళ్ళంట మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రామానాయుడు తీసిన ఈ మూవీ 1987నవంబర్ 27న రిలీజయింది.

జంధ్యాల తన దైన బాణీలో కథ, కధనం, మాటలు అందించి విజయాన్ని చేకూర్చారు. 16లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఏకంగా 5కోట్లు కలెక్ట్ చేసింది.రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమాలో పాటలను అలరించేలా చేసింది. ఈ మూవీకి 9రోజుల ముందు భానుమతి గారి మొగుడు మూవీ లో బాలయ్య సరసన విజయశాంతి నటించింది. రెండు వారాలు బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎబో ఏవరేజ్ అయింది.

డాక్టర్ రాజశేఖర్ , జీవిత జంటగా నటించిన ఆహుతి మూవీ డిసెంబర్ 3న వచ్చింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎబో ఏవరేజ్ గా నడిచింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన ముద్దుబిడ్డ డిసెంబర్ 4న వచ్చింది. తొలి రెండు వారాలు రన్నింగ్ బాగున్నా, ప్లాప్ టాక్ తెచ్చేసుకుంది. పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్షన్ చేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."