MoviesTollywood news in telugu

దేవుళ్ళు సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Devullu Movie :కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్ళు సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. పిల్లలపై తల్లిదండ్రుల పాత్ర అనే మెసేజ్ తో ఆధ్యాత్మికతను జోడించి తీసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. 2000నవంబర్ 9న రిలీజైన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ కి నంది అవార్డు సైతం వచ్చింది.

ఇప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ దేవాలయాల్లో మారుమోగు తుంటాయి. రాశి, పృథ్వి ప్రధాన పాత్రలు చేయగా, చైల్డ్ ఆర్టిస్టులుగా మాస్టర్ నందన్, బేబీ నిత్య నటించి మెప్పించారు. సుమన్, శ్రీకాంత్, ఎస్పీ బాలు, రమ్యకృష్ణ, విజయచందర్, లయ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన బాచి మూవీ దేవుళ్ళు రిలీజైన రోజే విడుదలైంది. అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. నవంబర్ 10న శివాజీ హీరోగా కాలేజీ మూవీ రిలీజయింది. రవి చావలి తెరకెక్కించిన ఈ మూవీ విజయాన్ని దక్కించుకుంది.

అక్టోబర్ 26న కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తెనాలి మూవీ వచ్చింది. హాస్య భరితంగా సాగే ఈ మూవీ డిజాస్టర్ అయింది. అక్టోబర్ 27న ఎన్టీఆర్ నగర్ మూవీ వచ్చింది. సినిమా హీరోల డూప్ తో సాగిన ఈ మూవీ డిజాస్టర్ అయింది.

డైరెక్టర్ అశోక్ కుమార్ అగర్వాల్ తెరకెక్కించిన శ్రీ సాయిమహిమ మూవీ సాయి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. సాయిప్రకాష్ సాయిబాబా పాత్రలో నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో శ్రీ శ్రీమతి సత్యభామ మూవీ లో రెహ్మాన్, విజయశాంతి నటించారు. ఇదీ పరాజయం పాలైంది.

వేణు హీరోగా చిరునవ్వుతో మూవీ నవంబర్ 16న రిలీజయింది. ప్రకాష్ రాజ్ వినూత్న పాత్రలో మెప్పించిన ఈ మూవీ విజయాన్ని అందుకుంది. జి రామ్ ప్రసాద్ తెరకెక్కించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."