MoviesTollywood news in telugu

పుష్పక విమానం ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే…

Ananand devarakonda pushpaka vimanam twitter review : క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా విడుదల అయింది. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండటం, విజయ్ దేవరకొండ ప్రచారం చేయటం వలన సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చిట్టిలంక సుందర్ అనే పాత్రలో నటించాడు.

సినిమా ప్రారంభంలోనే సుందర్ కి మీనాక్షి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. పెళ్ళైన మరుసటితోజే మీనాక్షి పారిపోతుంది. సమాజానికి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టేందుకు సుందర్ ఎంతో కష్టపడుతుంటారు.

సినిమా ఫస్ట్ ఆఫ్ పెద్దగా ఏమి లేదని…భార్య మిస్ అయిందనే పాయింట్ చుట్టూ కధ తిరుగుతుందని..అయితే బోర్ కొట్టకుండా ఫస్ట్ ఆఫ్ సాగింది. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి మారి కధ చాలా స్లో గా సాగుతుంది.

కొంతమంది కధ బాగుందని అంటున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదని అంటున్నారు. సినిమాపై మిశ్రమ స్పందన కనపడుతుంది. మొత్తం మీద ఆనంద్ దేవరకొండ బాగా నటించడాని అంటున్నారు