Healthhealth tips in telugu

శరీరంలో వేడి,నరాల బలహీనత,సయాటికా నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పులు,అనేవి ఉండవు

urine infection Home Remedies In Telugu :ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. సమస్య పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. ఈ రోజు ధనియాల కషాయం తాగితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ధనియాలను మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ ధనియాల పొడి,పటిక బెల్లం చిన్న ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి తాగాలి.

ఈ ధనియాల కషాయం తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అలాంటి వారికి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

అంతేకాకుండా నరాల బలహీనత,కీళ్లనొప్పులు, సయాటికా నొప్పి, అధిక బరువు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఓపికగా చేసుకోవాలి. ఎక్కువగా మందులు వాడటం కన్నా ఇలా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఈ కషాయం ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయిన తాగవచ్చు. వారం రోజులు తాగితే సరిపోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."