సంక్రాంతితో ఫైట్ చేసి అపజయం పొందిన సినిమాలు ఇవే…!
Sankranthi Movie : ఇంటికి పెద్ద కొడుకుగా, ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి మూవీ ఘనవిజయాన్ని సాధించింది. ముప్పలనేని శివ డైరెక్షన్ లో2005 ఫిబ్రవరి 5న వచ్చిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ సోదరులుగా శ్రీకాంత్, శివ బాలాజీ, శర్వానంద్ నటించారు. ఆర్తి అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించగా, వెంకీ సరసన స్నేహ, శ్రీకాంత్ సరసన సంగీత నటించారు.
తల్లి పాత్రలో శారద బాగా ఆకట్టుకుంది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. 40కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 4న 786 ఓ ఖైదీ ప్రేమకథ మూవీ రిలీజయింది. శశికాంత్ హీరోగా చేసిన ఈ మూవీ ప్లాప్ అయింది.
ఫిబ్రవరి 4నే వచ్చిన కీలుగుఱ్ఱం మూవీని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. రోహిత్, బాలాదిత్య బాగా నటించిన ఈ మూవీ ప్లాప్ అయింది. ఫిబ్రవరి 5న జగపతి బాబు, కళ్యాణి జంటగా నటించిన పందెం మూవీ రిలీయాజయింది. అయితే ఈ మూవీ ఆకట్టుకోలేదు.
ఫిబ్రవరి 10న సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎవరు నేను మూవీ రిలీజయింది. భీమేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ప్లాప్ అయింది. అదే రోజున ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో సచిన్ హీరోగా ఒరేయ్ పండు మూవీ ఏవరేజ్ అయింది.
ఇక నితిన్ నటించిన ధైర్యం మూవీ ఫిబ్రవరి 12న రిలీజయింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది. ఇదేరోజున వి ఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన మనసు మాట వినదు మూవీ రిలీజయింది. నవదీప్, అంకిత నటించిన ఈ మూవీ ఫెయిల్ అయింది.
ఫిబ్రవరి 18న థాంక్స్ మూవీ వచ్చింది. వినీత్, రష్మీ ప్రధాన పత్రాలు పోషించిన ఈ మూవీ కూడా ఫెయిల్ అయింది. ఫిబ్రవరి 23న రాధాగోపాళం మూవీ వచ్చింది. శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ఈ మూవీని బాపు తెరకెక్కించారు. హిట్ అయింది.
ఫిబ్రవరి 26న పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రావణమాసం మూవీ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి హరికృష్ణ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. మార్చి 3న సాయికుమార్ హీరోగా శ్లోకం మూవీ నిరాశ పరిచింది.

