Healthhealth tips in telugu

Black pepper with jaggery:చలికాలంలో నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?

Black pepper with jaggery benefits In Telugu :చలికాలంలో నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా.. బెల్లం, నల్ల మిరియాలు రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. బెల్లం, నల్ల మిరియాల్లో ఎక్కువగా వేడి చేసే లక్షణం ఉంటుంది. అందువలన ఈ చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఈ చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. 3 మిరియాల గింజలు కొంచెం బెల్లం తీసుకుని ఈ రెండింటినీ కలిపి పేస్ట్ గా చేసి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి అన్ని తగ్గిపోతాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి.

కొంతమందికి ముక్కునుండి రక్తం కారుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గాలంటే పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ముక్కు నుండి రక్తం కారటం తగ్గిపోతుంది. ఈ మిశ్రమం తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు బెల్లం, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో ఉండే లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."