MoviesTollywood news in telugu

RRR సినిమా కోసం ఆలియా భట్ ఎంత చార్జ్ చేసిందో తెలుసా?

Bollywood actress Alia Bhatt : బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగాRRR సినిమా తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కరోనా కారణంగా జాప్యం జరిగింది. RRR సినిమా హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నారు.

ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా జక్కన్న డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అందుకే ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రతీ భాషలోని సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనేపధ్యంలో తాజాగా బాలీవుడ్ భామ ఆలియా భట్ పాత్ర ఓ ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఇందులో ఆమె క్యారెక్టర్ 15 నిమిషాలకు మించి ఉండదట. ఈ క్యారెక్టర్‌ చేయడానికి ఆలియా కేవలం 10 కాల్ షీట్లను మాత్రమే కేటాయించి, ఏకంగా రూ.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతకు అనుగుణంగా నడుస్తున్నారు. నిజానికి సౌత్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ వాళ్లకు చాలా చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు ఛాన్స్ వస్తే చాలు బాలీవుడ్ భామలు ఠక్కున వాలిపోతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."