Healthhealth tips in telugu

జీవితంలో మళ్లీ నరాల బలహీనత రాకూడదంటే.. వీటిని ఇలా తీసుకోండి!

Nerves weakness home remedies in telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య నరాల బలహీనత. కాళ్లు, చేతులు గుంజడం, తిమ్మిర్లు రావడం, చిన్న పనికే అలసిపోవడం.. ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఎంత ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

డాక్టర్ల చుట్టూ తిరిగి, మందులు వాడి విసిగిపోయారా? అయితే ఒకసారి మన ఇంట్లోనే దొరికే ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేయండి. వీటిని నేను చెప్పినట్లుగా తీసుకుంటే నరాల వీక్‌నెస్ తగ్గడమే కాదు, జీవితంలో మళ్లీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు. అదెలాగో ఈ ఆర్టికల్‌లో చూద్దాం!

సరైన పోషకాహారం తీసుకోకపోవటం, సరైన జీవనశైలి లేకపోవటం వంటి కారణాలతో శరీరం బలహీనం అవుతుంది. దాంతో నరాల బలహీనత కూడా వస్తుంది. ఆ బలహీనత ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ముఖం మీద ముడతలు కనపడతాయి. 25 సంవత్సరాల వయస్సులో కూడా ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనపడతారు.
oats benefits
శరీరంలో నొప్పి, చేతులు మరియు కాళ్ళలో నొప్పి, ఎముకలు, కీళ్ళలో నొప్పి, నడుములో నొప్పి ఉంటుంది మరియు ఇది వైవాహిక జీవితం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే 40 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ల వయస్సులో ఉండే చురుకుదనాన్ని కలిగి ఉండటమే కాకుండా నరాల బలహీనత,శారీరక బలహీనత వంటివి అసలు ఉండవు.

ఒక కప్పులో పావు కప్పు ఒట్స్, 10 కిస్ మిస్ వేసి దానిలో పాలను పోయాలి. పాలను వాడటం ఇష్టం లేనివారు నీటిని వాడవచ్చు. వీటిని 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టాలి. ఈ ఒట్స్ మిశ్రమాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటారు.

సాయంత్రం సమయంలో తీసుకుంటే 4 నుంచి 5 గంటల మధ్యలో తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. ఇలా పది రోజులు తీసుకుంటే శరీరంలో బలహీనత తగ్గి చురుకుగా ఉషారుగా ఉంటారు. నరాలు బలంగా,ఆరోగ్యంగా ఉంటాయి. నరాలలో నొప్పులు కూడా తగ్గుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."