Healthhealth tips in telugu

ఈ నట్స్ ఈ విధంగా తీసుకుంటే మీ శరీరంలో immunity రెట్టింపు పెరుగుతుంది…అసలు మిస్ కావద్దు

Dry fruits benefits In telugu : డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ చలి కాలంలో శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయ పడతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
cashew nuts benefits in telugu
బాదంపప్పు విషయానికొస్తే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. cholesterol అసలు ఉండదు. శ్వాసకోశ సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు నాలుగు బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది.

జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటలకు మంచి రుచిని ఇస్తుంది. జీడిపప్పులో విటమిన్ E, బి 6, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అలసట, నీరసం వంటివి లేకుండా చేస్తుంది.రోజుకి 4 జీడిపప్పులను తీసుకోవాలి.

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. రోజు రెండు వాల్నట్స్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది.

పిస్తాపప్పులో cholesterol ని తగ్గించే లక్షణాలు ఉండటం వలన గుండెకు మేలు చేస్తుంది. అలాగే డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. రోజుకి నాలుగు పిస్తా పప్పులు తింటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ని 5 గంటల పాటు నీటిలో నానబెట్టి తింటే వాటిల్లో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."