మెగాస్టార్ సినిమాలో రవితేజ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్…?
Tollywood Hero ravi teja remuneration : మాస్ మహారాజ్ రవితేజకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో ఓ కీలక పాత్ర రవితేజ చేయాలని దర్శకుడు బాబీ అడగడం, దానికి రవితేజ ఒకే చెప్పడం పూర్తయిందని అంటున్నారు.ఓ వైపు మెగాస్టార్ చిరు సినిమా కావడం, మరో వైపు డైరెక్టర్ బాబీతో సాన్నిహిత్యం కారణంగా రవితేజ్ వెంటనే ఓకే చెప్పాడని టాక్.
ఇప్పటికే చిరంజీవి హీరోగా చేసిన అన్నయ్య సినిమాలో రవితేజ, వెంకట్ లు తమ్ముళ్లుగా నటించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో మెగాస్టార్ తో సినిమా ఒకే చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ పాత్ర కోసం రవితేజ ఏకంగా 7 కోట్లు తీసుకోబోతున్నాడని, అందుకు నిర్మాతలు కూడా ఒకే చెప్పారని టాలీవుడ్‌లో టాక్.
వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ క్రాక్ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టడంతో మళ్లీ రేంజ్ పెరిగింది. దాన్ని అలానే కొనసాగించాలనే ప్రయత్నంతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ చేస్తున్నాడు. ఇక చిరు సినిమాలో నటించే ఆఫర్ కూడా అందుకున్నాడని వార్త టాలీవుడ్‌లో వైరల్ గా మారింది.

