Healthhealth tips in telugu

ఇంట్లో ఒక్క బిర్యానీ ఆకును కాల్చి చూడండి.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు!

Bay Leaf In Telugu : బిర్యానీ ఆకు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే బిర్యానీ లేదా మంచి మసాలా కూరలు, కదా! కానీ, ఈ ఆకు కేవలం వంటల రుచిని పెంచడానికే కాదు, మన ఇంటి వాతావరణాన్ని మార్చడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా?

ఇంట్లో ఓ చిన్న బిర్యానీ ఆకును కాల్చడం వల్ల మన మానసిక ప్రశాంతతకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ మ్యాజిక్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.

బిర్యానీ ఆకును తేజపత్ర, తమలపత్ర, బే ఆకు అని కూడా పిలుస్తారు. మనలో చాలా మందికి బిర్యానీ ఆకు అంటే ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. ఈ ఆకులో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
Biryani leaves health benefits In Telugu
మనస్సుకు ప్రశాంతత కలగటానికి మనం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సువాసనలను పీల్చినప్పుడు మనస్సుకు ప్రశాంతంగా అన్పిస్తుంది. ఈ విధంగా వాసనల ద్వారా రుగ్మతలను తగ్గించే ప్రక్రియను ‘అరోమా థెరపీ’ అని అంటారు. అయితే మనం వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకును కాల్చి పీల్చటం ద్వారా కూడా మనస్సు ప్రశాంతత కలుగుతుంది.

అది బిర్యానీ ఆకు. బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి ,వాసన వస్తాయి. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి. దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు మూసేయండి .

ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచండి. దాంతో ఆ పొగ అంతా గదిలో బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి చూడండి. మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి. దాంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."