Healthhealth tips in telugu

Nerve Weakness:నరాల బలహీనత,నరాలలో అడ్డంకులు,నరాల్లో నొప్పి,డయబెటిస్ జీవితంలో ఉండవు

Home Remedies To Treat Nerve Weakness In Telugu : నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. ప్రారంభంలోనే డాక్టర్ ని సంప్రదించి మందులు వాడుతూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే మంచి ఫలితం తొందరగా వస్తుంది. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళి దానికి సహాయపడతాయి.

ఇవి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఈ నరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. .డయబెటిస్ ఉన్నవారికి కూడా నరాలు బలహీనం అవుతాయి. డయబెటిస్ ఉన్నవారు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ రెమిడీ కోసం ఒక గిన్నెలో పావు స్పూన్ దాల్చినచెక్క పొడి, పావు స్పూన్ మెంతుల పొడి, పావు స్పూన్ శొంఠి పొడి వేసి ఒక గ్లాస్ నీటిని పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఇలా మరిగించటం వలన దాల్చినచెక్క,మెంతులు,శొంఠిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి.

ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ నీటిని తాగటానికి ముందు అరగంట కడుపు ఖాళీగా ఉంచాలి. పది రోజులు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.