RRR కోసం తారక్ ఎన్ని మూవీస్ వదిలేసాడో తెలుసా ?
Tollywood Hero NTR : బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మొదలు ఎందరో సెలబ్రిటీలు ఈ ట్రైలర్ పై స్పందిస్తున్నారు. ఇక జనవరిలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మూవీ తెరకెక్కడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. కరోనా కారణంగా తీవ్ర జాప్యం అయింది. ఇంత ఆలస్యం కావడంతో ఈ సినిమా కోసం ఎన్ని ఆఫర్స్ వదులుకున్నారని ఓ వ్యక్తి అడగడంతో తారక్ స్పందిస్తూ తనేప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టానని.. జక్కన్నతో సినిమా చేస్తున్నానని తెలిసి, నాకు మరో ఆఫర్ ఎవరిస్తారంటూ బదులిచ్చాడు. ఈ సినిమా తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు.
పాన్ ఇండియా మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగం చేస్తోంది. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో తారక్ బిజీగా అయ్యాడు. మొదటి సారి బాలీవుడ్ మీడియాతో ముంబైలో మాట్లాడిన తారక్ .. వారి ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించాడు.
