ఈ చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా…?
Tollywood Heroine keerthi suresh : సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువ కావడంతో సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య గ్యాప్ బాగా తగ్గింది. హీరో హీరోయిన్స్ తమ సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేసుకోవడంతో పాటు లైవ్ లో కూడా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు. ఇక హీరోయిన్లు అయితే తమ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి.
చిరునవ్వు చిందిస్తున్న ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఆరా తీస్తే ఎవరో తెలిసి, చాలా క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్‌లో నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 30కి పైగా చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్.
తెలుగు ఆడియన్స్ మదిని దోచుకున్న కీర్తి సురేష్ … రెమో, నేను లోకల్, రజిని, మురుగన్ వంటి సూపర్ హిట్స్ అందుకుంది. ఇక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మహానటిలో చూపిన నట విశ్వరూపానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట, సాని కాయిధం, భోళా శంకర్, వాశి.. వంటి మూవీస్ చేస్తోంది.