Healthhealth tips in telugu

Skin problems:చర్మంపై దురద,చర్మ సమస్యలు ఉంటే ఈ చిట్కాను ఫాలో అయితే సరి

Skin Problems Home Remedies in Telugu : చలి కాలంలో చర్మం పొడిగా మారటం, దురద వంటి చర్మ సమస్యలు రావటం సహజమే. ఉష్ణోగ్రతలు అమాంతం ప‌డిపోయిన‌ప్పుడు చ‌ర్మ క‌ణాల్లోని తేమ‌శాతం త‌గ్గ‌డంతో ఇలా జ‌రుగుతూ ఉంటుంది. చర్మానికి సంబందించిన అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా సహాయపడుతుంది.

దురద, చర్మ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే క్రీములు, లోషన్లు వాడుతుంటారు. ఇవి తాత్కాలికంగా దుర‌ద స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం కలిగిస్తాయి.ఇందులోని కెమిక‌ల్స్ వ‌ల్ల చ‌ర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మ‌న వంటింట్లో దొరికే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే చ‌ర్మాన్ని కాపాడుకోవచ్చు.

దీని కోసం కాకరకాయ ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి. ఈ కాకరకాయ పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని దానిలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో రాశి ఆరాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు దురదను తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే పసుపు కూడా చర్మ సమస్యలను తగ్గించుకోవటానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.