Healthhealth tips in telugu

అరగ్లాసు తాగితే చాలు.. ఛాతీలో కఫం, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు మాయం!

Cough Home Remedies In Telugu : జలుబు, దగ్గు, ఛాతీలో కఫం లేదా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ అద్భుతమైన అరగ్లాసు పానీయం మీకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి, గొంతు ఇన్ఫెక్షన్‌ను శాశ్వతంగా తగ్గించే ఈ న్యాచురల్ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.

చలి గాలులు విపరీతంగా ఉన్నాయి. అలాగే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో దగ్గు,జలుబు వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. దగ్గు, గొంతు నొప్పి వంటివి వచ్చాయంటే తొందరగా తగ్గక చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఈ సమస్యలు తగ్గటానికి ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం.
Biryani leaves health benefits In Telugu
కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దగ్గు,గొంతు నొప్పి వంటివి వచ్చినప్పుడు ప్రారంభ దశలోనే ఈ డ్రింక్ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా కోసం 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ ఇంటిలో అందుబాటులో ఉండేవే.

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి దానిలో అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 2 బిరియాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగిస్తే అల్లం, బిరియాని ఆకులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి.

మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి తాగితే 3 రోజుల్లోనే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, జలుబు వంటివి అన్నీ తగ్గిపోతాయి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."