MoviesTollywood news in telugu

ఈ ఏడాది టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఎంత మంది…?

2021 Tollywood Heroines : ప్రతియేటా వెండితెరకు హీరో హీరోయిన్స్, ఇతర నటీనటులు వస్తూనే ఉంటారు. అయితే టాలెంట్ తో పాటు అదృష్టం ఉన్న వాళ్లే ఇండస్ట్రీలో మిగులుతారు. ఇక 2021లో వచ్చిన హీరోయిన్స్ ఎవరా అని చూస్తే, ఈ ఏడాది ఆరంభంలో ఉప్పెన మూవీలో నటించిన కృతిశెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే పలు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.

30రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున ఫల్గుణ మూవీస్ లో నటించిన అమృతా అయ్యర్ ఈ ఏడాది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో పలు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారికి సుపరిచితమే. చెక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ తర్వాత ఇష్క్ మూవీలో కూడా చేసింది. కానీ రెండు మూవీస్ కూడా ఆమెకు పేరు తీసుకు రాలేదు.

డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాని టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కేతికా శర్మ తర్వాత లక్ష్య మూవీ చేసింది. రెండు సినిమాలు కూడా ఆకట్టుకోలేదు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి మూవీలో నటించిన కన్నడ భామ శ్రీలీల మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ధమాకా మూవీలో రవితేజతో జతకడుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."