MoviesTollywood news in telugu

రెండు జడలు.. పెద్ద కళ్ళజోడు.. అమాయకపు నవ్వు…గుర్తు పట్టారా…?

Tollywood heroine anjali : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉండడంతో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్ననాటి ఘటనలు, ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా రెండు జడలు వేసుకొని పెద్ద కళ్ళజోడు పెట్టుకొని అమాయకంగా నవ్వుతు కనిపిస్తున్న ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ, సత్తా చాటుతున్న ఈమె తెలుగమ్మాయే.

అయితేనేం ముందుగా తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఎవరంటే, అందాల భామ అంజలి. తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ తో ఆకట్టుకుంది.

ఇక జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాలేదు. వచ్చినా దెబ్బతిన్నాయి. ఇక కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది. అంతేకాదు, సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."