Healthhealth tips in telugu

కేవలం 3 సార్లు వాడితే చాలు: ఆస్తమా, జలుబు, దగ్గు శాశ్వతంగా మాయం!

Asthma Home Remedies In Telugu : వాతావరణం మారినప్పుడల్లా ఆస్తమా, జలుబు, దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా? కేవలం 3 సార్లు పాటించడంతో ఊపిరి సమస్యల నుండి శాశ్వతంగా ఎలా బయటపడాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి. మీ ఆరోగ్యమైన శ్వాస కోసం అద్భుతమైన సహజ పరిష్కారం.

ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఒకటి.మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి.దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది.
clove tea weight loss
కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే చిన్నపిల్లలు, యుక్త వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఆస్తమా ఉన్నప్పుడు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. విపరీతమైన చలి, మంచు కారణంగా ఈ కాలంలో ఆస్తమా సమస్య ఎక్కువగా ఉంటుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 5 లవంగాలు, 7 మిరియాలు, చిన్న అల్లం ముక్క,5 తులసి ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉంటే రోజులో 2 సార్లు తీవ్రత తక్కువగా ఉంటే ఒకసారి తాగాలి. ఈ డ్రింక్ ఆస్తమా నుండి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."