2021 అచ్చిరాని స్టార్ డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నారో…?
Tollywood star directors : హీరోలైనా, స్టార్ డైరెక్ట్రర్స్ అయినా సరే, టైమ్ బాగోపొతే అస్సలు అచ్చిరాదు. ఎంత పెద్ద సినిమా తీసినా హిట్ పడదు. అజయ్ భూపతి, మారుతి, శివనిర్వాణ వంటి వాళ్లకు 2021లో ఒక్క హిట్ దక్కలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా చేసి, ఆతర్వాత 2018లో ఆర్ ఎక్స్ 100మూవీతో హిట్ కొట్టిన అజయ్ భూపతిని ఈ ఏడాది శర్వానంద్, సిద్దార్ధ లతో తీసిన మహా సముద్రం నిరాశ పరిచింది.
మంచి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన డైరెక్టర్ దాసరి మారుతి గత ఏడాది ప్రతిరోజూ పండగే మూవీతో హిట్ కొట్టాడు. అయితే ఈ ఏడాది రోజులు మారాయి మూవీతో విజయాన్ని అందుకోలేకపోయారు. టీచర్ గా చేస్తూ సినిమా మోజుతో ఇండస్ట్రీకి వచ్చిన శివనిర్వాణ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, 2017లో నిను కోరి మూవీతో డైరెక్టర్ గా సక్సెస్ సాధించాడు.
తర్వాత మజిలీలో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు కానీ, ఈ ఏడాది టక్ జగదీష్ సక్సెస్ ఇవ్వలేదు. ఇక గతంలో వినయ విధేయ రామ విషయంలో బోయపాటి శ్రీనివాస్ కి ఇదే జరిగింది. కానీ ఇపుడు బాలయ్యతో అఖండ తీసి అఖండ విజయాన్ని నమోదుచేసుకుని, మళ్ళీ తన సత్తా చాటాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల , గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ ఏడాది హిట్స్ అందుకున్నారు.
