MoviesTollywood news in telugu

బాలీవుడ్ స్టార్స్ చేస్తున్న సైడ్ బిజినెస్ లు ఏమిటో తెలుసా ?

Bollywood Actors Real estate Business : ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోల దగ్గర నుంచి అందరూ కూడా యాడ్స్ వంటివి చేస్తూ రెండు చేతులా సంపాదించడంతో పాటు తమ సంపాదనను వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొదలుకొని చాలామంది స్టార్స్ ఇదే ఒరవడి సాగిస్తు న్నారు.

నటి కృతి సనన్ కి బిగ్ బి తన అపార్ట్ మెంట్ ఏకంగా నెలకు 10లక్షలకు అద్దెకు ఇచ్చాడు. ఆమె 60లక్షలు డిపాజిట్ కింద జమ చేసిందట.
సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ లో ఉంటూ, బాంద్రా లోని అపార్ట్ మెంట్ ని అద్దెకు ఇచ్చాడు. ఒక ప్లాట్ కి 8లక్షల 25వేలు, మరో అపార్ట్ మెంట్ కి 95వేలు వస్తుందని అంటున్నారు.

సైఫ్ అలీఖాన్ అయితే తన అసోసియేషన్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా అపార్ట్ మెంట్ ని గిల్టీ కంపెనీకి అద్దెకు ఇచ్చాడు. నెలకు మూడున్నర లక్షలు వస్తుంది. 15లక్షలు డిపాజిట్ రూపంలో వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ పేరిట రెండు ప్రాపర్టీస్ రెడీ చేసి అద్దెకు ఇచ్చాడు. ఒక దానికి 17లక్షల 56వేలు, రెండో దానికి 6లక్షల 15వేలు చొప్పున వస్తోంది.

అలాగే రోహిత్ శెట్టి బాంద్రా నగర్ లోని సిగ్నియా బిల్డింగ్ లో ప్లాట్ 5లక్షలకు అద్దెకు ఇచ్చాడు. ఇక అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ అయితే వత్స అండ్ అము బంగ్లా లో కింది ఫ్లోర్ ని 18లక్షల 90వేలకు 15ఏళ్లపాటు అద్దెకు ఇచ్చేసాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."