MoviesTollywood news in telugu

దేవత సీరియల్ యాక్టర్ సత్య రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

devatha serial actress manasi joshi : కార్తీక దీపం, గృహలక్ష్మి సీరియల్స్ తర్వాత మంచి టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ అనగానే స్టార్ మాలో ప్రసారమవుతున్న దేవత సీరియల్ గురించే చెప్పాలి. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఆదరణ చూరగొని సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. ఈ సీరియల్ లో సత్య పాత్ర చేస్తున్న వైష్ణవి రామిరెడ్డి ఈ సీరియల్ నుంచి వైదొలగింది.

దేవత సీరియల్ నుంచి వైష్ణవి తప్పుకున్న విషయం అందరికీ తెల్సిందే అయినా, ఎందుకా అనే చర్చకు తావు ఇవ్వకుండా కొన్ని పర్సనల్ కారణాల వలన తప్పుకున్నట్టు వివరణ కూడా వచ్చింది. అయితే సత్య క్యారెక్టర్ లో ఓ కొత్త నటి వచ్చి చేరింది. ఆమె పేరు మానసి జోషి. 1993 సెప్టెంబర్ 7న జన్మించిన ఈమె బెంగుళూరులో జన్మించింది. ఈమె పుట్టి పెరిగింది అంతా అక్కడే.

చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద మక్కువ కారణంగా మానసి జోషి స్టడీస్ పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి వచ్చి, కొన్ని యాడ్స్ లో చేసింది. కన్నడ సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈమెకు హీరోయిన్ ఛాన్స్ లు రాలేదు. అయితే క్యారెక్టర్ యాక్టర్ గా కొన్ని సినిమాలు చేసి, రాధారమణి సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కావడంతో కన్నడలో పాటు తమిళ సీరియల్స్ లో చేసింది. ఇక తెలుగులో దేవత సీరియల్ లో సత్య క్యారెక్టర్ లో నటిస్తూ మెప్పిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."