Jayam Movie:జయం సినిమాకి ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Tollywood Hero Nitin First Movie Jayam Movie : యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన జయం మూవీ అద్భుత విజయాన్ని అందు కుంది. అంతా దేవుడు ఆడించే నాటకం అంటూ డైరెక్టర్ తేజ కొత్త కాన్సప్ట్ తో తానే రచించి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తొలిసినిమాతోనే నితిన్ మంచి నటన కనబరిచి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
అలాగే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా కూడా మంచి నటన ప్రదర్శించిన ఈ సినిమాలో గోపీచంద్ విలనిజం భయంకరంగానే ఉంటుంది. కులశేఖర పాటలకు ఆర్పీ పట్నాయక్ అద్భుత బాణీలు అందించాడు. మొత్తం 12సాంగ్స్ ఆకట్టుకుంటాయి. 2002జూన్ 14న రిలీజైన ఈ మూవీ కేవలం 2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, 30కోట్ల వరకూ వసూళ్లు సాధించింది.
విలన్ గా గోపీచంద్, బెస్ట్ మేల్ కమెడియన్ గా సుమన్ శెట్టి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా శ్వేత, వెళ్ళవయ్యా వేళ్లూ అంటూ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన సింగర్ సునీత .. ఇలా మొత్తం 4నంది అవార్డులను జయం మూవీ సొంతం చేసుకుంది. జయం మూవీకి రెండు వారాల ముందుగా వచ్చిన 123మూవీ లో ప్రభుదేవా, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ లు నటించగా, ప్లాప్ అయింది.
కె సుభాష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జ్యోతిక హీరోయిన్ గా చేసింది. ప్రేమ నటించిన దేవి నాగమ్మ మూవీని అలహరి తెరకెక్కించాడు. ఈ మూవీ ఏవరేజ్ అయింది. లవర్ బాయ్ తరుణ్, రీమాసేన్, గజాల నటించిన అదృష్టం మూవీ జూన్ 6న రిలీజయింది. శేఖర్ సూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది.
జయంతో పాటు హృదయాంజలి మూవీ రిలీజయి ప్లాప్ అయింది. జయం వచ్చిన వారం తర్వాత ఉదయ కిరణ్ నటించిన శ్రీరామ్ మూవీ రిలీజయింది. వి ఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి హీరోగా చేసిన నీతో మూవీని జాన్ మహేంద్రన్ తెరకెక్కించగా, పరాజయం పాలైంది.


