ఉల్లితో ఇలా చేస్తే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు 7 రోజుల్లో మంచులా కరిగిపోతుంది
Onion Weight Loss Drink : ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్య, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు తగ్గాలంటే మంచి ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం. లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే మంచి ఫలితం కనబడుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి సగం ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయలో సగం ముక్కను 4 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి పదిహేను రోజుల పాటు తీసు కోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.

ఈ విధంగా 15 రోజులపాటు తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి పోయి అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం నిర్విషీకరణ చేయటానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడతాయి.

తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా కొవ్వుగా మారకుండా చూస్తుంది. ఉల్లిపాయలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి సహాయపడుతుంది. అలాగే ఒక శక్తివంతమైన ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

