Healthhealth tips in telugu

N95 మాస్క్‌ను ఎన్ని సార్లు వాడవచ్చు…దాని లైఫ్ టైం ఎంత?

N95 Mask : కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ మాస్క్ వాడుతున్నారు. మరి కొంత కాలం మాస్క్ లను వాడాలని నిపుణులు చెప్పుతున్నారు. మాస్క్ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో N95 మాస్క్ ఒకటి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. మనలో చాలా మంది కరోనా సోకకుండా అరికట్టడంలో N95 మాస్క్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
n95 mask
అయితే నిజంగా N95 మాస్క్ అంతలా కరోనాను అరికట్టడంలో సహాయపడుతుందా అనే విషయం గురించి తెలుసుకుందాం. డాక్టర్స్ కూడా కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ N95 మాస్క్ తప్పకుండా ధరించాలని చెప్పుతున్నారు. ఈ మాస్క్‌లో పాలీ ప్రొఫైలిన్ అనే ఫైబర్ ఉండుట వలన బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములను బయటనే ఆపేస్తుంది.

యాంత్రిక, స్థిర విద్యుత్‌ ను ఒకే టైంలో ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే N95 మాస్క్ లను జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. అయితే మాస్క్ ముడతలు పడటం, మురికిగా మారడం, తడిగా మారితే మాత్రం వెంటనే మార్చేయాలి. అలానే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

మాస్క్ పెట్టుకొనేటప్పుడు, తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మాస్క్ ముందు ప్రాంతంను అసలు టచ్ చేయకూడదు. మాస్క్ ను ధరించేటప్పుడు, తీసెటప్పుడు కేవలం దాని తాడులను మాత్రమే పట్టుకోవాలి. ఎందుకంటే ఒక వేళ మాస్క్ పైన కరోనా వైరస్ ఉంటే అది మన చేతుల ద్వారా ముక్కు లేదా నోరు, కళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.