రోజూ 1 స్పూన్ ఈ పొడి తింటే చాలు.. రోజంతా ఫుల్ ఎనర్జీ! నీరసం, అలసట మాయం!
Energy powder :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి వల్ల చాలామంది నిరంతరం అలసట, నీరసం మరియు నిసత్తువతో బాధపడుతుంటారు. దీని కోసం మార్కెట్లో దొరికే కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్ కాకుండా, ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో శక్తిని పెంచుకోవచ్చు.
రోజూ కేవలం 1 స్పూన్ ఈ పొడిని పాలతో లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం ద్వారా రోజంతా హుషారుగా, యాక్టివ్‌గా ఉండటానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ పోస్ట్‌లో ఈ పౌడర్ తయారీ విధానం, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాడాల్సిన విధానాన్ని వివరంగా తెలుసుకుందాం.
ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, సరైన వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చాక జాగ్రత్త పడటం కన్నా సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే సరిపోతుంది.

ఈ పొడి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టి పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్ నట్స్, పావు కప్పు వేరుశనగ, ఒక కప్పు పూల్ మఖానా వేసి డ్రై గా వేగించాలి. బాగా వేగాక పొడి చేసుకొని బౌల్ లో వేయాలి. ఆ తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్ల సొంపు, ఒక స్పూన్ మిరియాలు, మూడు స్పూన్ల పుచ్చ గింజల పప్పు వేసి వెగించి పొడి చేసుకొని బౌల్ వేసుకోవాలి.
ఆ తర్వాత ఎండు ఖర్జూరాలను గింజలు తీసేసి ముక్కలుగా చేసి అదే పాన్ లో వెగించి పొడి చేయాలి. తయారుచేసుకున్న అన్నీ పొడులను ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. దీనిలో పటికబెల్లం పొడి వేసి కలపాలి. ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడిని వేసి తాగాలి. ఈ విధంగా తాగటం వలన రోజంతా నీరసం,నిసత్తువ,అలసట లేకుండా హుషారుగా ఉంటారు. కంటికి సంబందించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

