తరచూ ముక్కు నుండి రక్తం వస్తుందా…ఉల్లితో ఇలా చేస్తే సరి
Nose bleeding Home Remedies: ముక్కు నుండి రక్తం కారటం అనేది ఈ వేసవికాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ సమస్య రాగానే అసలు కంగారూ పడవలసిన అవసరం లేదు. ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పోరలు పొడిగా మారటం మరియు ముక్కులో వేలు పెట్టుకోవటం వలన నాసికా పొరలకు గాయం అయ్యి రక్తం వస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి.
ఉల్లిపాయలో విటమిన్ సి ఉండుట వలన రక్త కేశ నాళికలను బలోపేతం చేస్తుంది. అలాగే ఉల్లిలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీల్చుతు ఉంటే నిదానంగా రక్తం కారటం అగుతుంది. ఉల్లిపాయ ప్రతి వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటుంది.
ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు రెండు చుక్కల కొత్తిమీర రసం వేస్తే రక్తం కారడం ఆగడంతో పాటు ఎలర్జీ వల్ల ముక్కు పొరలు పగిలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక తులసి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తులసి ఆకుల రసం కూడా ముక్కు నుండి రక్తం కారినప్పుడు ముక్కులో వేస్తే సరిపోతుంది.
ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలలో ఏదో ఒక దానిని ఫాలో అయితే మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి ముక్కు నుండి రక్తం కారే సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

