Healthhealth tips in telugu

వాము+బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

carom seeds and jaggery benefits : వాము,బెల్లం రెండింటిలోను ఎన్నో పోషకాలు ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాము,బెల్లం కలిపి తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కడుపు నొప్పి మరియు పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది. ఆస్తమా వ్యాధితో బాధపడేవాళ్ళు వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన ఆస్తమా తగ్గుముఖం పడుతుంది.

వెన్ను నొప్పి సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ వాము, చిన్న బెల్లం ముక్కను కలిపి తాగాలి. ఇలా తాగటం వలన వెన్ను నొప్పి అలాగే శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు,జలుబు,గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది.

అయితే, బెల్లం మరియు వాములను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వేడి చేసే గుణం అధికంగా ఉండుట వలన వాంతులు,తల తిరగటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అతిగా తీసుకుంటే అనర్ధమే కదా.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."